పసిపిల్లలపై పైశాచికం
మత్తులో మునిగితేలే మాయ
మమతానురాగాలే మరిచేనా
మానవా మత్తు మానవా ....?
హైదరాబాద్, ప్రజాజ్వాల:
మత్తు మనుషులను గమ్మత్తుగా మాయం చేస్తుంది. మత్తు లేనిదే మనిషి లేడు. మమతానురాగాలు మాయమైనయ్ .. వావివరసలు , రక్త సంబంధాలు, అన్ని మత్తులోనే కొట్టుకుపోతున్నాయ్.. చిన్నా పెద్ద మర్యాదలన్నీ మత్తులోనే ... నీటి బుడగ లాంటి జీవితం నిజమవుతున్న తరుణమిదే.. ఆస్తులు అంతస్తులు అవసరమే లేదు. ఆ నిమిషం మైమరిచిపోయే మత్తు కావాలి.. అది ఉంటే చాలు... కొండంత ధైర్యం,.. జీవితమే ఆనందమయం.. అది ఉంటే చాలు .. ఈ లోకమేమైనా పరువాలేదు. పరేషాన్ అక్కర్లేదు.. నిదురలో తేలియాడుతూ బతికేయచ్చు.. అలాంటి మత్తు మనుషులను కమ్మేస్తోంది.. నెమ్మదిగా నిమురుతూ అచేతనంలో పడేస్తూంది. మత్తులో మనిషి అచేతన స్థితికి దిగజారుతూ.. నేడు జరుగుతున్న అన్ని నేరాలు ఘోరాలకు కారణమవుతున్నాడు. మనిషి అంటే కేవలం పురుషుడనే కాదు.. స్త్రీ పురుషులనే తేడా లేకుండా ఈ మహమ్మారి మత్తు ముంచేసింది..
మొన్నటికి మొన్న తెలంగాణ మొత్తం కొవ్వొత్తులతో దద్దరిల్లేలా చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆందోళనలతో రొడ్డెక్కారు. ప్రభుత్వం విఫలమైందని, సఫలమైందని నానా నినాదాలు చేశారు. లక్షల రూపాయల బహుమానాలు ప్రకటించి పాపాత్ముడిని పనిలో పడ్డారు. తీరా ఆ దుర్మార్గుడు రైలు కింద పడి చనిపోయాడని , ఖేల్ ఖతం అన్నారు.. అంతకు ముందు నలుగురు యువకులను నడిరోడ్డుపై కాల్చి చంపి దిశ కథను ఖతం చేశారు. అంతకు ముందు శ్రీనివాస్ రెడ్డి అనే దుర్మార్గుడిని ఉరితీయాలని ఒక ఊరు మొత్తం ఆందోళన చేసింది. ఇలా మత్తులో తూగుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్న దుర్మార్గుల వార్తలు రాగానే లొల్లి చేయడం .. మరిచిపోవడం మామూలే అయ్యింది. మరి ఇంత పెద్దగా రాద్దాంతాలు చేసే ప్రజానీకం..అసలు మూలా కారణాలపై ధర్నాలు , ఆందోళనలు చేయడం లేదు ఎందుకు. నేరం జరిగిందంటే దాని వెనుక కక్షలు, కుట్రలు ఎన్ని ఉన్నా ఆ నేరానికి బలం ఊతమిస్తుంది కేవలం మత్తు అనే సంగతి అందరికి తెలుసు. కానీ సామాన్యుడు నుంచి మేథావుల వరకు మద్యపానం నిషేదం గురించి మాట్లాడే నాథులే లేరు.. మంత్రులు, ముఖ్యమంత్రులు పాలకులు, ప్రతిపక్షాలు సైతం మద్యం మత్తు పానియాలు బందు పెట్టాలని ఎందుకు గట్టిగా నిరసనలు చేయడం లేదు.. నిరుద్యోగుల కోసం , రైతుల కోసం, ఆత్మహత్యలు, హత్యాచారాలపై రొడ్డెక్కి నిరసనలు ధర్నాలు చేసే మానవతావాదులు మందు మద్యం, మత్తుపై ఎందుకు నోరు మెదపరు.. ఒక హంతకుడిని ఉరి తీసే వరకు ఊరుఊరు నిద్రహారాలు మాని నిరసనలు తెలిపినట్టే మాయదారి మత్తును వదిలించేందుకు సన్నద్దం కావచ్చు కదా...
ఇప్పటి వరకు నమోదైన పరిష్కరించబడిన కేసులన్నీ నేరాలు, ఘోరాలు చూస్తే అందులో ప్రధాన నిందితుడు , పరోక్ష నిందితుడు కేవలం మత్తుకు బానిసై ఉండటమే., భార్య భర్తల మధ్య గొడవలకు, వివాహేతర బంధాలకు, అత్యాచారాలకు, ఆస్తి తగాదాలకు, హత్యలకు, రాజకీయ కుట్రలకు ప్రధాన మూలం మత్తు పానియమే బలం.. కానీ రాష్ట్రంలో , దేశంలో అటువంటి సంపూర్ణ మద్యపాన నిశేదం జరుగదు. అలా చేస్తే ఆ నాయకులు గద్దె మీద ఉండలేరు.. అసలు రాజ్యమంతా దాంతోనే బతుకీడుస్తుందా అంటే ఆ మేదావులు అవును అంటున్న పరిస్థితి.. ఇటీవల ఉద్యోగాలకు, ఉపాధి కల్పనలో, వెనుక బడిన సామాజిక వర్గాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కల్పించిన 15శాతం రిజర్వేషన్ ఎంత హాస్యాస్పదమో.. ఎవరైనా చదువుకోడానికి , ఉద్యోగాలు పొందటానికి రిజర్వేషన్లను ప్రకటిస్తారు. కానీ.. ఏకంగా మద్యం దుకాణాలు పెట్టుకోవడానికి రిజర్వేషన్ వ్యవస్తను తీసుకువచ్చారంటే మన మనుషులకు మత్తు అవసరం ఎంత ఉందో అనేది స్పష్టమవుతుంది.. ఇక్కడ రిజర్వేషన్ కల్పించడం ప్రభుత్వం తప్పు అని మాట్లాడుతున్నారు .. కానీ ప్రజలకు దాని అవసరం అధికంగా ఉంది కాబట్టే... ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో అటువంటినిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది.
నేరం ఎక్కడ ఏ పరిస్థితిలో జరిగిన ఆ క్షణంలో మాయదారి మత్తు మూల కారణంగా విచారణలో తేలుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లు పెట్టి మందు కొట్టిన వారికి జరిమానాలు విధించడం ,.. కంటే అసలు ఆ మాయదారి వ్యవస్థను మార్చడానికి ఎందుకు పూనుకోవడం లేదు.. ఎంతో మంది మేథావులు , ఎంతో మంది మానవతావాధులు ఉన్న దేశంలో ఎందుకు మద్యపాన నిశేదం సాద్యం కాలేకపోతుంది. దేశం మొత్తం మత్తుపైనే ఆధారపడిందా ...? మత్తు పానియాల ఆదాయంతోనే ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయా? మత్తు లేకుంటే దేశప్రజలు బతుకలేరా..? అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
ఓ చిన్నారి బలి అయ్యిందని రోడ్డెక్కి నిరసనలు చేసే మానవతావాదులు ఒక్కసారి పిడికిలి బిగించి ఏకమై అదే విధంగా మాయదారి మత్తును నిషేదించాలని రోడ్డెక్కితే సమస్యకు పరిష్కారం లభించదా...? దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో ఏ మూలనా ఏ చిన్న పెద్ద నేరం జరిగినా ఆ బాధ్యులు మత్తుకు బానిసైల ఉండటం సహజమైనదిగా తెలుస్తుంది. ఇలాంటి మద్యపాన మత్తు వ్యవస్థపై ఇప్పటికైన మేథావి వర్గాలు చర్చించి.. సంపూర్ణ మద్యపాన నిర్మూలనకు దోహదపడాలని ఆశీస్తూ.... రఫీ మహ్మద్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
నేను సైతం ఉద్యమిస్తాను
రిప్లయితొలగించండి