వార్తలు విశ్లేషణలు

24, ఏప్రిల్ 2021, శనివారం

కలియుగ లక్షణాలు.. తెలుసుకుంటే నిజమే అంటారు..

మహాభాగవతంలోని 12వ స్కంధంలో కలియుగ లక్షణాలు గురించి రచించారు వేదవ్యాసులు. అవేంటో మనం కూడా తెలుసుకుందాం.

కలి ప్రభావం పెరుగుతున్నా కొద్దీ సత్యం,


ధర్మం, దయ, క్షమ, ఆయువు, జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటాయి.

ధనం ములం ఇదం జగత్ అంటారుగా. అలానే ధనవంతుడే గుణవంతుడు, ధర్మపరుడు, సర్వ నియంత అవుతాడు.

ప్రేమ వివాహాలు కుల, మతాలకు అతీతంగా జరుగుతాయి. కులం, శీలం, యోగ్యతల మాట లేకుండా పెండ్లిలు చేస్తారు. ప్రేమలో నిజాయితీ కూడా చాలా తక్కువ.

మోసం చేయడం, అబద్ధాలు ఆడటం ఉత్తమ నైపుణ్యంగా మారుతాయి.

బ్రహ్మ జ్ఞానం పొందటం వలన కాకుండా కేవలం జంధ్యం వేసుకున్నందుకు బ్రాహ్మణులుగా గుర్తించబడుతారు.

అరవగలిగేవాడు పండితులు. చెడుగా ఉండటమే మంచితనము. సహజీవనమే వివాహంగా పరిగణిస్తారు

దూరంగా ఉండే మురికిగుంట పుణ్య తీర్థంగా, వెంట్రుకలు పెంచుకోవడం అందముగా భావించడం, పొట్ట నింపుకోవడమే పురుషార్థం, కుటుంబ పోషణ ఘన కార్యంగా, కీర్తిని కోరడం ధర్మాచరణగా ప్రజలు గుర్తిస్తారు.

కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.

ఐకమత్యమే మహాబలం.

గోవ‌ధ స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మారుతుంది.

ఈ అంశాలను నేటి సమాజానికి పోల్చి చూడండి. మన పూర్వీకులు ఎంతటి జ్ఞానవంతులో, మనం ఎంతటి విజ్ఞానాన్ని, జ్ఞాన సంపదను కోల్పోయామో తెలుస్తుంది


లౌకిక‌వాద రాజ‌కీయాల‌కు బ‌ల‌వుతున్న ముస్లింలు..!



లౌకిక‌వాదం అనే రాజ‌కీయ వ్యూహం భార‌తీయ ముస్లింల‌కు భ‌విష్య‌త్తులో తీర‌ని న‌ష్టాన్ని క‌లిగించ‌నుంది. చెప్పుకోవ‌డానికి ఎంత బాగున్నా కూడా.. చేత‌ల్లో మాత్రం మెజారిటీల‌ను అవ‌మానించేలా మారుతుంది. అలా అని ముస్లింల‌కు ఏమైనా గౌర‌వం ద‌క్కుతుందా అంటే అది లేదు.

ముస్లింల బుజ్జ‌గింపు పేరుతో ఇస్లాం ఆచరించే ఇత‌ర దేశాల్లో వారిని భార‌తీయ ముస్లింల మ‌ధ్యలో క‌లిపేస్తున్నారు. అందుకు ఇస్లాం ఖ‌త్రేమే హై లాంటి నినాదాల‌ను వాడుతున్నారు. శ‌ర‌ణార్థుల పేరిట దేశంలోకి అక్ర‌మంగానో, స‌క్ర‌మంగానో తీసుకొచ్చి ప‌డేస్తున్నారు.

చొర‌బాటుదారుల‌కు, శ‌ర‌ణార్థుల‌కు లౌకిక పార్టీలు రేష‌న్ కార్డులు, గుర్తింపు కార్డులు కూడా ఇప్పిస్తున్నాయి. అస్సాం, బెంగాల్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు అక్ర‌మంగా నివ‌సిస్తున్న‌ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి. ఇక అక్ర‌మంగా చొర‌బ‌డిన వారు చేసే దాడులు, అరాచ‌కాల నింద‌లు పూర్తిగా ముస్లిం స‌మాజంపైనే పడుతున్నాయి.

మైనారిటీల సంక్షేమం అని మాట్లాడే ఏ పార్టీ కూడా వారిని విద్యావంతులుగా చూడాల‌ని కోరుకోక‌పోవ‌డం శోచ‌నీయం. ముస్లిం స‌మాజంలో మ‌త చాంద‌స‌వాదాన్ని ఎలా నూరిపోయాలా.. ఎలా వారిని బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలా అని మాత్ర‌మే లౌకిక పార్టీలు ఆలోచిస్తున్నాయి. అక్ర‌మంగా చొర‌బ‌డిన ఇస్లాం ఆచ‌రించే వారికి సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తూ, భార‌తీయ ముస్లింల‌ను బాయ్ చారా పేరుతో లౌకిక పార్టీలు వెర్రి వాళ్ల‌ను చేస్తున్నాయి.

మ‌రోవైపు మైనారిటీల సంతుష్టీక‌ర‌ణ అనే పేరిట మెజారిటీల సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను అవ‌మానించే వారిని ఎన‌కేసుకు వ‌స్తున్నాయి లౌకిక ప్ర‌భుత్వాలు. అంతేకాకుండా మెజారిటీ హిందువుల ఆల‌యాల‌పై జ‌రిగే దాడుల‌పై క‌నీసం స్పందించ‌డం లేదు. అదే మైనారిటీల పండుగ‌ల‌కు ఆయా లౌకిక పార్టీల నాయ‌కులు లేని మ‌త‌సామ‌ర‌స్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

దాని వ‌ల‌న మెజారిటీ హిందువుల్లో ముస్లిం ప‌ట్ల ద్వేష భావం రోజురోజుకు పెరుగుతోంది. లౌకిక రాజ‌కీయాలు భార‌తీయ ముస్లిం మెడ చుట్టూ ఉచ్చులాగా మారుతున్నాయి. విదేశాల నుంచి అక్ర‌మంగా వ‌చ్చిన ఇస్లాం ఆచ‌రించే వారికి రాజ‌భోగాలు, భార‌తీయ ముస్లింల‌కు మ‌తం పేరిట పేద‌రికాన్ని లౌకిక రాజ‌కీయాలు అంట‌గ‌డుతున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు పాత బ‌స్తీలోని ఎంఐఎం పార్టీ తాము ముస్లిం స‌మాజం కోసం పోరాడుతున్నామ‌ని చెబుతుంది. వాస్త‌వంలో ఆ పార్టీకి చెందిన నేత‌లు ఇత‌ర మ‌త‌స్తుల భూముల‌ను క‌బ్జా చేయ‌డం, వారి ఆస్తుల‌ను బ‌ల‌వంతంగా లాక్కోవ‌డం, ఆల‌యాల భూముల‌ను మాయం చేయ‌డం, ఆల‌యాల‌ను క‌నుమ‌రుగు చేయ‌డం లాంటివి చేస్తున్నారు.

నిజంగా పాత బ‌స్తీలోని ముస్లిం స‌మాజం ఎంఐఎం లాంటి పార్టీని స‌మ‌ర్థిస్తుందా అంటే.. కాద‌నే చెప్పుకోవాలి. ఎప్ప‌టి క‌థ‌నో ఎందుకు.. ఇటీవ‌ల జ‌రిగిన జిహెచ్ఎంసి ఎన్నిక‌ల‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుందాం. ఎంఐఎం అభ్య‌ర్థులు వ్య‌వ‌హ‌రించిన తీరు అస‌లు మ‌నం ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానాల‌ను క‌లిగించింది.

ఎంఐఎం నేత‌ల వ్యాఖ్య‌లు.. వారిని వెన‌కేసుకొచ్చే వారి చేత‌లు ముస్లిం స‌మాజంపై మెజారిటీ ప్ర‌జ‌ల్లో హేయ‌మైన భావాన్ని క‌లిగించేలా ప్రేరేపిస్తున్నాయి. వారిని ఉగ్ర‌వాదులుగా, ఉగ్ర‌వాద స‌మ‌ర్థ‌కులుగా చిత్రీక‌రిస్తున్నాయి. పాత బ‌స్తీ ఉదాహ‌ర‌ణ కేవ‌లం మ‌చ్చుకు మాత్ర‌మే. దేశంలో విదేశి మ‌త చాంద‌స‌వాదం(వాహ‌బి) పెరిగిన ప్ర‌తిచోటా మెజారిటీ ప్ర‌జ‌లు అన్యాయానికి గుర‌వుతున్నారు.

ఆ నింద‌లు భార‌తీయు ముస్లింలు పడుతున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొన‌సాగితే.. భ‌విష్య‌త్తులో భార‌త దేశం షరియా చ‌ట్టాల ఉచ్చులో చిక్కుకొని ఎడారిగా మార‌డ‌మో.. లేదా మెజారిటీల ఆగ్ర‌హానికి గురైన ముస్లిం స‌మాజం గ‌డ్డు కాలాన్ని ఎదుర్కోవ‌డమో జ‌రుగుతుంది.

ఇప్పటికైనా ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లంతా స‌మానం అనే విధంగా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రించాలి. రాజ్యాంగ సూత్రాల‌ను ఆచ‌రించాలి. ప్ర‌జ‌ల‌ను కుల‌, మ‌త ప్రాతిప‌దిక‌న విడ‌దీసి విదేశీ శ‌క్తుల‌కు స‌హ‌క‌రించే విధ‌మైన శైలిని మార్చుకోవాలి. భార‌తీయులు చైత‌న్య‌వంతుల‌వుతున్న ఈ త‌రుణంలో మైనారిటీ సంతుష్టీక‌ర‌ణ పేరిట ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు, చొర‌బాటుదారుల‌కు మ‌ద్ధ‌తునిచ్చే దుస్సాహ‌సాన్ని లౌకిక పార్టీలు మానుకోవాలి.

లేదంటే భ‌విష్య‌త్తులో అంత‌ర్యుధం రావ‌డ‌మే కాదు. బ‌ల‌మైన మెజారిటీల చేతిలో లౌకిక పార్టీలు మట్టి క‌ల‌వ‌డం ఖాయం. విదేశీ ఆక్ర‌మ‌ణ‌దారుల‌తో పాటు భార‌తీయ ముస్లిం స‌మాజం చేటు చూడ‌టం అనివార్యంగా మార‌టం త‌థ్యం.

అందుకే యూనిఫాం సివిల్ కోడ్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. విదేశీ అక్రమ చొరబాట్లను నిరోధించాలి. అక్రమంగా ఉంటూ దేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను వారి స్వదేశాలకు పంపి భారతీయ ముస్లిం సమాజంపై పడుతున్న నిందలను దూరం చేయాలి. ఈ బాధ్యతను ప్రతి రాజకీయ పార్టీ తమ భుజాలపైకి ఎత్తుకోవాలి.




మీకు తెలుసా.. ఫ్యాక్టరీస్ చట్టం 1948 ప్రకారం, ప్రతి వయోజన వ్యక్తి వారంలో 48 గంటలు మరియు రోజులో 9 గంటలకు మించి పనిచేయకూడదు.

సగటు వ్యక్తి జీవితకాలంలో 90,000 గంటలు పనిలో గడుపుతారు అంటే 30శాతం జీవిత భాగం అన్నమాట!

మీ ఉద్యోగం మీ జీవన నాణ్యతపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.
లాక్డౌన్ వలన ఇంటి నుంచే పని చేసే అవకాశం రావటమెమోకానీ చాలా మందికి మాత్రం వర్క్ లైఫ్ బ్యాలన్స్ తప్పింది. 24/7 లాగా అర్ధరాత్రులు, ఆదివారాలు కంపెనీ కాల్స్ రావటం ఎప్పుడు పడితే అప్పుడు MST లేదా ZOOMలో మీటింగులు.. మరో పక్క ఇంట్లో వాళ్ళ పనులు వామ్మో.. ఇవన్నీ చూసాక వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే ఆఫీసులో పని చేయటమే మేలు అనిపిస్తుంటుంది ఉద్యోగులకు.

కొంతమంది నిద్ర మానుకొని ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఆదివారాలు సెలవు రోజులు అని చూడకుండా తెగ శ్రమ పడిపోతూ ఉంటారు. పై అధికారుల మెప్పు కోసమో ప్రమోషన్ కోసమో వాళ్ళ అటెన్షన్ కోసమో తాపత్రయ పడుతూ ఉంటారు. దీని వల్ల ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ కాలేకపోతారు. ఇంట్లో వాళ్ళతో పిల్లలతో సరైన సమయం గడపలేకపోతారు.

డెడ్ లైన్లు టార్గెట్లు అంటూ ఒత్తిడి


పెంచుకోకండి. ఈ ఉద్యోగం పోతే మరొకటి. కంపెనీ కన్నా పని మీద ప్రేమను పెంచుకోండి. అది మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
నేను కళ్లారా చూసాను.. పని ఒత్తిడి ఎక్కువయ్యి ఆఫీసులో ఒకతను ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు.
కొంత మంది పనిలో పడి టైంకి తినటం, మంచినీళ్లు తాగడం మరిచిపోతూ ఉంటారు. దాని వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటమే కాక బాడీ డీహైడ్రేట్ అయ్యి మైగ్రేన్ వచ్చే ప్రమాదముంది. మీ ఆరోగ్య అవసరాలను గుర్తించి కొన్ని ఏమర్జెన్సీ మందులను మీ వెంట ఉంచుకోవడం ఉత్తమం.
కొన్ని విదేశీ కార్యాలయాల్లో న్యాప్ (నిద్ర)కి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. దీని వల్ల ఉత్పాదకత పెరుగుతుందని.

ఉద్యోగంతో పాటు వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యం కొసం ప్రశాంతత కోసం సమయం వెచ్చించండి. సరదాగా స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఉద్యోగ సమయాన్ని వ్యక్తిగత సమయాన్ని కలపకండి. మీ జీవితం కేవలం పని చేయటం కోసమే కాదు మీరు సంతోషంగా ఉండటం కోసం కూడా అని గుర్తుంచుకోండి.


భవిష్యత్తులో అవి కనుమరుగైతాయా?

news&views
భవిష్యత్తులో అవి కనుమరుగైతాయా?

ఆధునిక కాలంతో పరుగులు పెడుతున్న ప్రపంచంలో  పాడిపశువులు కనుమరుగైయ్యే  ప్రమాదం పొంచి ఉన్నదా ? అంటే అవుననే సమాధానాలే దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనంతాగా భారత దేశంలో పాడి సంపద ఉండేది. వ్యవసాయానికి మూలధారమే పాడి పశువులుగా చెప్పుకునేవారు. అలాంటి వ్యవస్థ నేడు దేశంలో కనుమరుగవుతోంది. ఆధునిక పరికరాలు వ్యవసాయానికి వినియోగిస్తుండటంతో  రైతులు పశుపోషణ విస్మరిస్తున్న వైనం నేడు దర్శనమిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో  ఒకప్పుడు ప్రతి ఇంటిలోనూ పాడిపశువులు దర్శనమిచ్చేవి. ప్రతి కుటుంబం పాడిపశువులతో సుఖసంతోషాలతో విరాజిల్లేది. కానీ నేడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార ధోరణి దర్శనమిస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ అనే పౌష్టిక పదార్థాలు నేడు గ్రామాల్లో లభించడం లేదు. 

పాలప్యాకెట్లు లాంటి ఆధునిక ఉత్పత్తులు రావడంతో వాటిపైనే ఆధారపడుతున్నారు. శుద్ధమైన పాలు మాత్రం నేడు లబించడం లేదు. కష్టపడకుండా నేరుగా అన్ని పదార్ధాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పశుపోషణ వ్యర్థం అనే భావనలో ఉన్నారు. మరోవైపు విదేశాల్లో మాంసాహారానికి అధిక డిమాండ్ ఉండటంతో  అరకొర కనబడుతున్న పశువులు సైతం కనుమరుగవుతున్నాయి. వ్యాపార లావాదేవిల పరంగానే కొంతమంది పాడిపోషణ చేపడుతున్నారు 





news&views


కరోనా మహమ్మారితో కష్టాలు పడుతున్న గ్రామీణ ప్రజలకు కరెంటు బిల్లు కిరికిరి మొదలైంది.. నార్తెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులకు లెక్కలేకుండా పోయింది. యూనిట్ ప్రకారం లెక్కలు లేకుండా బిల్లు వస్తుండటంతో జనం ఆందోళనచెందున్నారు. ఇంట్లో ఒక ఫ్యాన్, లైటు, టీవీ మాత్రమే వాడుతున్నా. నెలకు 1200 బిల్లు రావడంతో ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. విద్యుత్ వినియోగం ఎంత చేశారో రీడింగ్ లెక్కలేకుండా బిల్లు వచ్చిందని వాపోయారు. అందాద చొప్పున బిల్లులు చేయడంపై అధికారులను అడిగితే అది అంతే అని ఫిర్యాదు చేయాలన్నారని, రోజంతా ఏదో పనులు చేసుకుని బతుకీడుస్తున్న తాము ఎక్కడ ఫిర్యాదులు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమపై కరెంటు బిల్లుతో స్తోమతకు మించి భారం వేయడం సరికాదని విస్మయం వ్యక్తం చేశారు.

15, ఏప్రిల్ 2021, గురువారం

varthanidhi

తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ ప్రజా జీవితంలో అనేక  మార్పులు వచ్చాయి. అయితే అప్పటి వరకు ఉన్న కష్టాలు సుఖాలు రాష్ట్ర అవతరణ అనంతరం అనేక సమస్యలకు కారణమయ్యాయి. తొలి ప్రభుత్వం  ప్రవేశపెట్టిన  ప్రజా సంక్షేమ  పథకాలు అందరికి   ఆమోదయోగ్యమైనా  అందులోని అవకతవకలతో అందరికి అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. తెలంగాణ రాజ్యంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని ప్రభుత్వం కితాబిస్తున్నప్పటికి ప్రజా ధనం దుర్వినియోగమే అన్నట్లుగా ప్రతిపక్షాలు దెబ్బి పొడుస్తున్నాయి.




 ప్రజజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి పరిపాలనా యంత్రాగాలకు అనుసంధానంగా పని చేయాలనే సంకల్పంతో  సాంకేతిక పరిజ్క్షానంతో  ఆధునికంగా ప్రచురించబడుతున్న  అంతర్జాల పత్రికనే మా వార్తానిధి.. 


మీ సమస్యలను మా ముందుకు తీసుకువస్తే అది  పరిష్కారమయ్యే వరకు మీకు అండగా ఉంటామని, మేము ఉద్దేశ్య పూర్వకంగా , కక్ష పూరితంగా  ఎవరిని విమర్శించకుండా కేవలం ప్రజాసమస్యలతోనే  ప్రచురణలు చేస్తామని హనుమాన్ సాక్షిగా  ఓ సాధారణ పౌరుడైన బైక్ రిపేర్ చేయు వ్యక్తితో మా పత్రికను ప్రారంభించడం జరిగింది..


vartha nidhi news views


 కరోనా కర్మకాలం


కరోనా కాలంతో కష్టాలు కేవలం మధ్యతరగతి కుటుంబాలకే పరిమితమైంది. అటు ధనికులు, ఇటు పేద బడుగు వర్గాలు సంతోషంగా  కాలం వెళ్లదీస్తున్నాయి. ఎటొచ్చి చిరుద్యోగులు, చిరువ్యాపారులు మాత్రం అటు మింగలేక ఇటు కక్కలేక బతుకీడుతున్నారు. పేదవాడికి కష్టం వస్తే ధనవంతులు సాయం చేస్తున్నారు. ధనవంతులకు కష్టమొస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇంకా ఆ ధనవంతుడికి మధ్య తరగతివాడే చేదోడు వాదోడుగా పనిచేయాల్సి వస్తుంది. కానీ ఆ మధ్య తరగతివాడికి కష్టాన్ని మాత్రం ఎవరు చూడరనేది అక్షర సత్యం.. 


ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం ఏర్పరిస్తే... భారత దేశంలో దాని ప్రభావం అంత లేదంటూనే ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ కాలాయాపన చేస్తోంది. పేదవారికి, ధనవంతులకు ఢోకా లేకుండా నిబంధనలు పెడుతూ పరిపాలనా కొనసాగిస్తుంది. అయితే మధ్య తరగతి వారు మాత్రం అనేక ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు..

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్