కరోనా కర్మకాలం
కరోనా కాలంతో కష్టాలు కేవలం మధ్యతరగతి కుటుంబాలకే పరిమితమైంది. అటు ధనికులు, ఇటు పేద బడుగు వర్గాలు సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నాయి. ఎటొచ్చి చిరుద్యోగులు, చిరువ్యాపారులు మాత్రం అటు మింగలేక ఇటు కక్కలేక బతుకీడుతున్నారు. పేదవాడికి కష్టం వస్తే ధనవంతులు సాయం చేస్తున్నారు. ధనవంతులకు కష్టమొస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇంకా ఆ ధనవంతుడికి మధ్య తరగతివాడే చేదోడు వాదోడుగా పనిచేయాల్సి వస్తుంది. కానీ ఆ మధ్య తరగతివాడికి కష్టాన్ని మాత్రం ఎవరు చూడరనేది అక్షర సత్యం..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం ఏర్పరిస్తే... భారత దేశంలో దాని ప్రభావం అంత లేదంటూనే ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ కాలాయాపన చేస్తోంది. పేదవారికి, ధనవంతులకు ఢోకా లేకుండా నిబంధనలు పెడుతూ పరిపాలనా కొనసాగిస్తుంది. అయితే మధ్య తరగతి వారు మాత్రం అనేక ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి