వార్తలు విశ్లేషణలు

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

బహుజన రాజ్యాధికార యాత్ర 28 వ రోజు

 బహుజన రాజ్యాధికార యాత్ర 28 వ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో  కొనసాగింది.

రోడ్డుపై భోజనం చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఎస్సీ యాత్ర

ప్రజలకు దగ్గరవుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాబోయేది బహుజన రాజ్యమే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా  మూడు వందల రోజుల యాత్రను ప్రారంభించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 28 వరోజు యాత్ర మిర్యాల గూడ నియోజకర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన బహుజనులు ఏకం కావాలని పిలుపునిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. యాత్రలో భాగంగా మధ్యాహ్న భోజనం నడిరోడ్డుపై సాధారణ వ్యక్తిగా సామాన్యుడిగా ప్రజలతో కలిసి భోజనం చేశారు. ప్రజల కష్ట సుఖాలను పంచుకుంటూ వారికి బహుజన రాజ్యాధికారం సాధించడం కోసం సహకరించాలని కోరుతూ యాత్రను కొనసాగిస్తున్నారు. వేలాది మంది హారతులు పడుతుండగా ఆయన యాత్ర కొనసాగుతుంది.  స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి స్వాగతం పలకడం జరుగుతోందని, మహిళలు, రైతులు ఆప్యాయంగా ఆదరిస్తున్నారని, వారి కష్టాలు పోయే రోజులు వచ్చాయంటున్నారని తమను అక్కున చేర్చుకుంటున్నారని ఆర్ఎస్ ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎల్లప్పుడు ఏసీ రూంలలో ఉండాల్సిన ఆర్ ఎస్పీ  బీఎస్పీ బాటపట్టి బహుజనులను ఏకం చేయడానికి ఎండలో తిరుగుతున్నా అలసిపోవడం లేదంటూ ఆయన అభిమానులు అంటున్నారు. అందరికి దగ్గరగా ఏ నాయకుడు చేయలేని సహాసం ఆర్ ఎస్పి చేస్తున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు..







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్