మందుబంధు మత్తుకే మద్దతు
మందుకొట్టినోళ్లు మాటతప్పరు
బాటమీద తడబడిన మీటపైనే ద్యాస
ముప్పైలో మందెవరిస్తే వాళ్లకే వారి ఓటు
మరి కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. సర్వేలు తేడాగా వస్తున్నాయి.. గెలిచే ఛాన్సులు తక్కువనే ... ఏం చేసినా ఫలితం శూన్యమే.. వందల కోట్ల రూపాయలు ఆశపెట్టిన అంత ఎఫెక్ట్ లేదు. కొత్త కొత్త పథకాల హామీలు అవసరమే లేదు. అభ్యర్థుల గ్రాఫ్.. డౌన్ అవుతుందే గానీ పెరగడం లేదు. ఏం చేయాలా అంటే..అన్నిటికి ఒకటే మార్గం.. "మందు బంధు" . ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్నారు..అయితే ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మరో ఎత్తు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంలో గెలుపు కోసం చేయని ప్రయత్నాలు లేవు.. ఏదైనా చేసి సరే తాము గెలువాలనే తపనతోనే తహతహ లాడుతున్నారు.. అందుకే అధికారపార్టీ అయినా మరో పరోక్ష పార్టీ అయినా తమ ఓటర్లను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా హుజూర్ బార్ తెరిచినట్లున్నారు.. నియోజకవర్గంలోని ప్రతి మండలం కేంద్రం, గ్రామ గ్రామంలో పలుకరించడానికి వెళ్తే మందుకొట్టినోడు..మాట మీద నిలబడతాడు... మందు కొట్టినోడు బాటమీద తడబడతాడు అన్నట్లుగానే నియోజకవర్గంలో మందుబాబుల అవతారం దర్శనమిస్తుంది.. వారికి ఎటు నుంచి వస్తుందో వారికే తెలుసు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి అక్రమంగా మద్యం డంప్ అవుతోంది. ఎక్కడ చూసిన రాయల్ స్టాగ్ మందు సీసాలే దర్శనమిస్తున్నాయి. గ్రామశివారుల్లో నలుగురు కనబడ్డారంటే.. వారిదగ్గర కచ్చితంగా ఫుల్ బాటిల్ ఉంటుంది.. మంచి నీళ్లు దొరకడం కష్టమేమో కానీ హుజూర్ బార్ లో ఏకాంతం ప్రదేశాల్లో కనబడే వారి దగ్గరకు వెళ్లి అడిగితే మందు మాత్రం దొరుకుతుంది.. అంటే అర్ధం చేసుకోవచ్చు.. పక్క నియోజకవర్గాల్లోని మందుబాబులు మదనపడుతున్నారంటా... మా కూడా ఇలా ఎన్నికలొస్తే బాగుండేదేమో.. మత్తుగా గమ్మత్తుగా కొన్ని రోజులు గడిచేదని..కొందరు పొరుగు నియోజకవర్గాల మందుబాబులు వచ్చిన అవకాశం ఎందుకు పోనియాలే అన్నట్లుగా అభ్యర్థుల ప్రచారకర్తల అవతారమెత్తి.. హుజూర్ బార్ లో నే తిష్ట వేశారంటే... అవగాహన చేసుకోవచ్చు...బాక్సులకు బాక్సులు హుజూరాబాద్ చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు కొందరు బడాబాబులు..హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా రాయల్ స్టాగ్ మద్యమే కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు ముప్పై మందిలోని కొందరు అభ్యర్థులెవరో... ఊరూరా వ్యాన్ లో తరలిస్తూ ఎన్నిక నాటికి ప్రజల చేత బాగా తాగించి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నమే సాఫీగా సాగుతోంది. ఎవరి పోరాటం వారిదే అన్నట్లుగా ప్రతిపక్షాలు, పోలీసులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటం పై తాగుబోతులుగా మారుతున్న వారి కుటుంబీకులు మండిపడుతున్నారు..
ప్రధానంగా ఈ ఎన్నికలో అధికారులు కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నట్లుగా ఉంది.. ఎన్నికల నిబంధనలు మద్యం అమ్మకాలు అనేవి నామమాత్రంగానే ఉన్నాయి... ఎవరికి ఎంత దమ్ము ఉంటే అంతా... అని ఎవరు ఎక్కువ కష్టపడితే వారిదే గెలుపు అని.. అది మందుబంధు పథకం తోనే సాధ్యం అని భావిస్తున్నట్లుగా ఉంది... అందుకే అధికార యంత్రాంగం సైతం మందుబంధు పథకానికి మద్దతిచ్చిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్ది మందుబాబుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే.. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. చివరగా పొలింగ్ రోజున బూత్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తేనే వణుకుపుట్టేస్తుంది... పార్టీలు పూర్తిగా 100శాతం ఓటర్లను మందుకు బానిసలుగా మార్చితేనే తమ గెలుపు సాధ్యమనుకుంటున్నాయా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. ఇప్పటికైనా ఈ ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్య ఎన్నికల విధానాన్ని కాపాడాల్సిందిగా పలువురు సామాజిక వేత్తలు కోరుతున్నారు.. ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఈ మందు బంధు పథకంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.. చూడాలి.... మరీ... ఎంతవరకు చర్యలు తీసుకోగలుగుతారో....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి