వార్తలు విశ్లేషణలు

26, సెప్టెంబర్ 2021, ఆదివారం

నేడే భారత్ బంద్


*అఖిల పక్షాల పిలుపుకు అన్ని వర్గాల మద్దతు
*ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసన
*విపక్ష ప్రతిపక్షాలు ఏకమైన రోజు  నేడే..
*ప్రజల మద్దతు ఎటు.. ?

నేడే భారత్ బంద్.. జయప్రదం చేయాలని పిలుపు నిచ్చాయి అఖిల పక్షాలు.. అన్ని వర్గాల వారు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టుతూ భారత్ బంద్ కు మద్దతు తెలుపుతున్నాయి. ప్రధానంగా రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఈ బంద్ ఎజెండా గా పెట్టుకున్నాయి. ఒక్క రోజు బంద్ వల్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.. విపక్షాలు, ప్రతిపక్షాలు పిలుపునిచ్చినంతా మాత్రానా ప్రజానీకం మద్దతు తెలుపుతుందా... ? ఈ బంద్ లో ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొంటారా.. వ్యాపార వేత్తలు, వర్తక సంఘాలు బంద్ లో పాల్గొంటాయా..? బంద్ ప్రభావం ప్రభుత్వాల పై ఏమేరకు ఉండబోతుంది..? 
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పై అఖిల పక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇక దేశం మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు సైతం బంద్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. అన్ని పార్టీలు ఏకమై బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే యూనియన్లు , బ్యాంక్ సిబ్బంది తదితర సంస్థలలో పనిచేసే ఉద్యోగులు సైతం బంద్ కు మద్దతు తెలుపుతున్నాయి. స్వచ్ఛందంగా బ్యాంక్ లు బందు ప్రకటించాయి.. వ్యవస్థలో ఇంతగా  ప్రభుత్వ రంగ వ్యవస్థలు సైతం  బంద్ కు మద్దతు తెలుపుతుంటే.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవనే అభిప్రాయం వ్యక్తమైనట్లేనా... నేడు జరిగే భారత్ బంద్ ప్రభావంతో ప్రభుత్వం విధానాల్లో మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయా.. వేచి చూడాల్సిందే....
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-9358413606572061"
     crossorigin="anonymous"></script>
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-format="fluid"
     data-ad-layout-key="-ft-q-57-df+1gc"
     data-ad-client="ca-pub-9358413606572061"
     data-ad-slot="1239354153"></ins>
<script>
     (adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్