వార్తలు విశ్లేషణలు

24, ఏప్రిల్ 2021, శనివారం

లౌకిక‌వాద రాజ‌కీయాల‌కు బ‌ల‌వుతున్న ముస్లింలు..!



లౌకిక‌వాదం అనే రాజ‌కీయ వ్యూహం భార‌తీయ ముస్లింల‌కు భ‌విష్య‌త్తులో తీర‌ని న‌ష్టాన్ని క‌లిగించ‌నుంది. చెప్పుకోవ‌డానికి ఎంత బాగున్నా కూడా.. చేత‌ల్లో మాత్రం మెజారిటీల‌ను అవ‌మానించేలా మారుతుంది. అలా అని ముస్లింల‌కు ఏమైనా గౌర‌వం ద‌క్కుతుందా అంటే అది లేదు.

ముస్లింల బుజ్జ‌గింపు పేరుతో ఇస్లాం ఆచరించే ఇత‌ర దేశాల్లో వారిని భార‌తీయ ముస్లింల మ‌ధ్యలో క‌లిపేస్తున్నారు. అందుకు ఇస్లాం ఖ‌త్రేమే హై లాంటి నినాదాల‌ను వాడుతున్నారు. శ‌ర‌ణార్థుల పేరిట దేశంలోకి అక్ర‌మంగానో, స‌క్ర‌మంగానో తీసుకొచ్చి ప‌డేస్తున్నారు.

చొర‌బాటుదారుల‌కు, శ‌ర‌ణార్థుల‌కు లౌకిక పార్టీలు రేష‌న్ కార్డులు, గుర్తింపు కార్డులు కూడా ఇప్పిస్తున్నాయి. అస్సాం, బెంగాల్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు అక్ర‌మంగా నివ‌సిస్తున్న‌ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి. ఇక అక్ర‌మంగా చొర‌బ‌డిన వారు చేసే దాడులు, అరాచ‌కాల నింద‌లు పూర్తిగా ముస్లిం స‌మాజంపైనే పడుతున్నాయి.

మైనారిటీల సంక్షేమం అని మాట్లాడే ఏ పార్టీ కూడా వారిని విద్యావంతులుగా చూడాల‌ని కోరుకోక‌పోవ‌డం శోచ‌నీయం. ముస్లిం స‌మాజంలో మ‌త చాంద‌స‌వాదాన్ని ఎలా నూరిపోయాలా.. ఎలా వారిని బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలా అని మాత్ర‌మే లౌకిక పార్టీలు ఆలోచిస్తున్నాయి. అక్ర‌మంగా చొర‌బ‌డిన ఇస్లాం ఆచ‌రించే వారికి సంక్షేమ ఫ‌లాల‌ను అందిస్తూ, భార‌తీయ ముస్లింల‌ను బాయ్ చారా పేరుతో లౌకిక పార్టీలు వెర్రి వాళ్ల‌ను చేస్తున్నాయి.

మ‌రోవైపు మైనారిటీల సంతుష్టీక‌ర‌ణ అనే పేరిట మెజారిటీల సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను అవ‌మానించే వారిని ఎన‌కేసుకు వ‌స్తున్నాయి లౌకిక ప్ర‌భుత్వాలు. అంతేకాకుండా మెజారిటీ హిందువుల ఆల‌యాల‌పై జ‌రిగే దాడుల‌పై క‌నీసం స్పందించ‌డం లేదు. అదే మైనారిటీల పండుగ‌ల‌కు ఆయా లౌకిక పార్టీల నాయ‌కులు లేని మ‌త‌సామ‌ర‌స్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

దాని వ‌ల‌న మెజారిటీ హిందువుల్లో ముస్లిం ప‌ట్ల ద్వేష భావం రోజురోజుకు పెరుగుతోంది. లౌకిక రాజ‌కీయాలు భార‌తీయ ముస్లిం మెడ చుట్టూ ఉచ్చులాగా మారుతున్నాయి. విదేశాల నుంచి అక్ర‌మంగా వ‌చ్చిన ఇస్లాం ఆచ‌రించే వారికి రాజ‌భోగాలు, భార‌తీయ ముస్లింల‌కు మ‌తం పేరిట పేద‌రికాన్ని లౌకిక రాజ‌కీయాలు అంట‌గ‌డుతున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు పాత బ‌స్తీలోని ఎంఐఎం పార్టీ తాము ముస్లిం స‌మాజం కోసం పోరాడుతున్నామ‌ని చెబుతుంది. వాస్త‌వంలో ఆ పార్టీకి చెందిన నేత‌లు ఇత‌ర మ‌త‌స్తుల భూముల‌ను క‌బ్జా చేయ‌డం, వారి ఆస్తుల‌ను బ‌ల‌వంతంగా లాక్కోవ‌డం, ఆల‌యాల భూముల‌ను మాయం చేయ‌డం, ఆల‌యాల‌ను క‌నుమ‌రుగు చేయ‌డం లాంటివి చేస్తున్నారు.

నిజంగా పాత బ‌స్తీలోని ముస్లిం స‌మాజం ఎంఐఎం లాంటి పార్టీని స‌మ‌ర్థిస్తుందా అంటే.. కాద‌నే చెప్పుకోవాలి. ఎప్ప‌టి క‌థ‌నో ఎందుకు.. ఇటీవ‌ల జ‌రిగిన జిహెచ్ఎంసి ఎన్నిక‌ల‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుందాం. ఎంఐఎం అభ్య‌ర్థులు వ్య‌వ‌హ‌రించిన తీరు అస‌లు మ‌నం ప్ర‌జాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానాల‌ను క‌లిగించింది.

ఎంఐఎం నేత‌ల వ్యాఖ్య‌లు.. వారిని వెన‌కేసుకొచ్చే వారి చేత‌లు ముస్లిం స‌మాజంపై మెజారిటీ ప్ర‌జ‌ల్లో హేయ‌మైన భావాన్ని క‌లిగించేలా ప్రేరేపిస్తున్నాయి. వారిని ఉగ్ర‌వాదులుగా, ఉగ్ర‌వాద స‌మ‌ర్థ‌కులుగా చిత్రీక‌రిస్తున్నాయి. పాత బ‌స్తీ ఉదాహ‌ర‌ణ కేవ‌లం మ‌చ్చుకు మాత్ర‌మే. దేశంలో విదేశి మ‌త చాంద‌స‌వాదం(వాహ‌బి) పెరిగిన ప్ర‌తిచోటా మెజారిటీ ప్ర‌జ‌లు అన్యాయానికి గుర‌వుతున్నారు.

ఆ నింద‌లు భార‌తీయు ముస్లింలు పడుతున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొన‌సాగితే.. భ‌విష్య‌త్తులో భార‌త దేశం షరియా చ‌ట్టాల ఉచ్చులో చిక్కుకొని ఎడారిగా మార‌డ‌మో.. లేదా మెజారిటీల ఆగ్ర‌హానికి గురైన ముస్లిం స‌మాజం గ‌డ్డు కాలాన్ని ఎదుర్కోవ‌డమో జ‌రుగుతుంది.

ఇప్పటికైనా ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లంతా స‌మానం అనే విధంగా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రించాలి. రాజ్యాంగ సూత్రాల‌ను ఆచ‌రించాలి. ప్ర‌జ‌ల‌ను కుల‌, మ‌త ప్రాతిప‌దిక‌న విడ‌దీసి విదేశీ శ‌క్తుల‌కు స‌హ‌క‌రించే విధ‌మైన శైలిని మార్చుకోవాలి. భార‌తీయులు చైత‌న్య‌వంతుల‌వుతున్న ఈ త‌రుణంలో మైనారిటీ సంతుష్టీక‌ర‌ణ పేరిట ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు, చొర‌బాటుదారుల‌కు మ‌ద్ధ‌తునిచ్చే దుస్సాహ‌సాన్ని లౌకిక పార్టీలు మానుకోవాలి.

లేదంటే భ‌విష్య‌త్తులో అంత‌ర్యుధం రావ‌డ‌మే కాదు. బ‌ల‌మైన మెజారిటీల చేతిలో లౌకిక పార్టీలు మట్టి క‌ల‌వ‌డం ఖాయం. విదేశీ ఆక్ర‌మ‌ణ‌దారుల‌తో పాటు భార‌తీయ ముస్లిం స‌మాజం చేటు చూడ‌టం అనివార్యంగా మార‌టం త‌థ్యం.

అందుకే యూనిఫాం సివిల్ కోడ్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. విదేశీ అక్రమ చొరబాట్లను నిరోధించాలి. అక్రమంగా ఉంటూ దేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను వారి స్వదేశాలకు పంపి భారతీయ ముస్లిం సమాజంపై పడుతున్న నిందలను దూరం చేయాలి. ఈ బాధ్యతను ప్రతి రాజకీయ పార్టీ తమ భుజాలపైకి ఎత్తుకోవాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్