వార్తలు విశ్లేషణలు

24, ఏప్రిల్ 2021, శనివారం



మీకు తెలుసా.. ఫ్యాక్టరీస్ చట్టం 1948 ప్రకారం, ప్రతి వయోజన వ్యక్తి వారంలో 48 గంటలు మరియు రోజులో 9 గంటలకు మించి పనిచేయకూడదు.

సగటు వ్యక్తి జీవితకాలంలో 90,000 గంటలు పనిలో గడుపుతారు అంటే 30శాతం జీవిత భాగం అన్నమాట!

మీ ఉద్యోగం మీ జీవన నాణ్యతపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.
లాక్డౌన్ వలన ఇంటి నుంచే పని చేసే అవకాశం రావటమెమోకానీ చాలా మందికి మాత్రం వర్క్ లైఫ్ బ్యాలన్స్ తప్పింది. 24/7 లాగా అర్ధరాత్రులు, ఆదివారాలు కంపెనీ కాల్స్ రావటం ఎప్పుడు పడితే అప్పుడు MST లేదా ZOOMలో మీటింగులు.. మరో పక్క ఇంట్లో వాళ్ళ పనులు వామ్మో.. ఇవన్నీ చూసాక వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే ఆఫీసులో పని చేయటమే మేలు అనిపిస్తుంటుంది ఉద్యోగులకు.

కొంతమంది నిద్ర మానుకొని ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఆదివారాలు సెలవు రోజులు అని చూడకుండా తెగ శ్రమ పడిపోతూ ఉంటారు. పై అధికారుల మెప్పు కోసమో ప్రమోషన్ కోసమో వాళ్ళ అటెన్షన్ కోసమో తాపత్రయ పడుతూ ఉంటారు. దీని వల్ల ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ కాలేకపోతారు. ఇంట్లో వాళ్ళతో పిల్లలతో సరైన సమయం గడపలేకపోతారు.

డెడ్ లైన్లు టార్గెట్లు అంటూ ఒత్తిడి


పెంచుకోకండి. ఈ ఉద్యోగం పోతే మరొకటి. కంపెనీ కన్నా పని మీద ప్రేమను పెంచుకోండి. అది మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
నేను కళ్లారా చూసాను.. పని ఒత్తిడి ఎక్కువయ్యి ఆఫీసులో ఒకతను ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు.
కొంత మంది పనిలో పడి టైంకి తినటం, మంచినీళ్లు తాగడం మరిచిపోతూ ఉంటారు. దాని వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటమే కాక బాడీ డీహైడ్రేట్ అయ్యి మైగ్రేన్ వచ్చే ప్రమాదముంది. మీ ఆరోగ్య అవసరాలను గుర్తించి కొన్ని ఏమర్జెన్సీ మందులను మీ వెంట ఉంచుకోవడం ఉత్తమం.
కొన్ని విదేశీ కార్యాలయాల్లో న్యాప్ (నిద్ర)కి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. దీని వల్ల ఉత్పాదకత పెరుగుతుందని.

ఉద్యోగంతో పాటు వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యం కొసం ప్రశాంతత కోసం సమయం వెచ్చించండి. సరదాగా స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఉద్యోగ సమయాన్ని వ్యక్తిగత సమయాన్ని కలపకండి. మీ జీవితం కేవలం పని చేయటం కోసమే కాదు మీరు సంతోషంగా ఉండటం కోసం కూడా అని గుర్తుంచుకోండి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్