వార్తలు విశ్లేషణలు

23, ఫిబ్రవరి 2022, బుధవారం

తెలంగాణ పోలీసులు అంటే నాకు ఎంతో నమ్మకం ఉండేది.. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి తెలంగాణ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వం వారికి ప్రత్యేక వాహనాలు కేటాయించి పకడ్బందిగా అధికారాలు కట్టబెట్టింది. కానీ నేను ఆన్ లైన్ లో ఓ కేసు పెడితే అది తమ పరిధిలోకి రాదని క్లోజ్ చేశారు.. ఇదిలా ఎందుకు చేశారని ట్విట్టర్ ద్వారా డీజీపీ గారికి పోస్ట్ చేస్తే డీసీపీ ఫోన్ చేసి కేసు మొత్తం విని మరలా కేసు తీసుకున్నారు. కానీ మరునాడు కేసు లో నిజం లేదని ఎఫ్ ఐఆర్ నమోదు చేయకుండా కొట్టిపడేశారు.. నిజం నిర్థారణ చేయాల్సింది పోయి నన్ను బయటకు పంపేసి బాధితుడిని బలవంతంగా సెటిల్మెంట్ కు కూర్చొబెట్టారు. అలా అని బాధితుడు వినినప్పటికి సెటిల్ మెంట్ కూడా చేయకుండా దర్జగా ప్రత్యర్థి తిరుగుతున్నాడు.. ఇలాగైతే తెలంగాణ పోలీసుల పై నమ్మకం ఎలా కలుగుతుంది...

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్